EENADU SRIKAKULAM DISTRICT PAPER PAGE NO. 2 DATED: 05-10-2012
YSR DISTRCT NEWS- SAKSHI EPAPER RAYACHOTI PAGENO 5, DATE: 17-09-2012
CASUAL- LEAVE- LR.RC.16-VE-2010, DATED 28-08-2012
THE CONTRACT LABOUR SALARIES (LABOUR EMPLOYMENT TRAINING AND FACTORIES (LAB.II) DEPARTMENT G.O.Ms.NO. 11 DATED : 17-01-12)
EENADU CHITTOOR DISTRICT EDITION PAGE NO. 5 DATE: 09-09-2012
సమ్మె కాలం ఒప్పందాన్ని అమలు చేయాలి
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కంప్యూటర్ టీచర్ల విజ్ఞప్తి
సమస్యల పరిష్కారం కోసం కంప్యూటర్ టీచర్లు సమ్మె చేసిన సందర్భంగా కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కంప్యూటర్ టీచర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం కన్వీనర్ ఎవి నాగేశ్వరరావు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, కమిషనర్‌లకు గురువారం లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,300 పాఠశాలల్లో 12,600 మంది కంప్యూటర్ ఫ్యాకల్టీలు పేద విద్యార్థులకు ఐసిటి పథకం ద్వారా కంప్యూటర్ విద్యనందిస్తున్నారు. కనీస వేతనాల అమలు తదితర సమస్యలపై వీరు 105 రోజలు సమ్మె చేశారు. ఈ సమ్మె అనంతరం వీరికి నెలకు రూ.2,600 వేతనం చెల్లించేటట్లు, ఇతర సమస్యలపై ఒప్పందం కుదిరింది. సమ్మె విరమణ జరిగి 5 నెలలు గడుస్తున్నా నేటికీ ఆ ఒప్పందంలోని అంశాలు అమలు కాలేదు.
వేతనాలు, సెలవులపై ఉత్తర్వులు
- కంప్యూటర్ టీచర్ల సంఘం హర్షం
కంప్యూటర్ టీచర్లు, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై కంప్యూటర్ టీచర్ల సంఘం రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న కంప్యూటర్ టీచర్లు తమ సమస్యల పరిష్కారానికి గతేడాది 105 రోజులు సమ్మె నిర్వహించారు. అదనపు పని గంటలు ద్వారా కంప్యూటర్ కోర్సు పూర్తి చేయాలని, తద్వారా సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడానికి ఒప్పందం కుదిరింది. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ప్రొసీడింగ్స్ 16/వి.ఇ-1/2010ను గత నెల 28న ఉత్తర్వులు విడుదల చేసింది. సమ్మె కాలానికి వేతనాలు ఏజెన్సీల ద్వారా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక కంప్యూటర్ టీచర్లందరికీ సంవత్సరానికి 15 క్యాజువల్ లీవులు అమలు చేయాలని ఉత్తర్వులు పై ప్రొసీడింగ్స్ ద్వారా జారీ చేసినందుకు కంప్యూటర్ టీచర్ల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎవి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
LABOUR EMPLOYMENT TRAINING AND FACTORIES (EMP) DEPARTMENT
G.O.Ms.No. 7, Dated: 12.01.2012.
EENADU MAIN PAPER,
PAGE NO 04 DATE 18-08-2012
EENADU SRIKAKULAM PALASA PAPER 2, DATE 23-07-2012
CHOLO COLLECTORATE ON DATED 16-07-2012
విజ్ఞ ప్తి
ప్రభుత్వం, ఏజెన్సీ మధ్య ఒప్పందం వలన కంప్యూటర్ టీచర్లు పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని ఏజెన్సీలు కుదుర్చుకున్న కాంట్రాక్టు కాలపరిమితి జున్ 15 2012 (వాస్తవంగా ఏప్రిల్ 23వ తేదీనూండే) ముగిసింది. దీనిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఉపాధ్యాయులకు ఎటువంటి సమాచారం లేకుండా, వారికి చెల్లించవలసి జీతం, పి.ఎఫ్ బకాయిలను చెల్లించకుండా వ్యవహరించడం తగదు. దీనిపై ప్రభుత్వం ఏజెన్సీలపై వత్తిడి తీసుకువచ్చి బకాయిలను చెల్లించేటట్లుగా చూడాలి. కాంట్రాక్టును వేరే వారికి అప్పగించినా మళ్ళీ పునరుద్దరించినా ప్రస్తుత్వం పనిచేస్తున్నవారినే కొనసాగించాలి. ఈ బకాయిలను జీతాలను వెంటనే చెల్లించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారి సంఘాలు మాకు మద్దతు ఇవ్వవలసినదిగా కోరుతున్నాము.
జిల్లా కమిటీ
ACT SRIKAKULAM
EENADU PAPER DATE 06-05-202 PAGE NO 11
SAKSHI PAPER DATE06-05-2012 PAGE NO 11